ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకు ఫైనల్ గా టైటిల్ లైగర్ అని ఫిక్స్ చేశారు. పూరీ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. లైగర్ అంటూ సినిమా టైటిల్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అంతేకాకుండా పూరీ మార్క్ సాలా క్రాస్‌బ్రీడ్ అనేది ట్యాగ్ లైను పెట్టారు.
తెలుగులో తీసి తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారనుకున్న ఈ సినిమా పూర్తిగా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నట్టు పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. బాక్సింగ్ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ పాన్ ఇండియా సినిమా లైగర్.. పిచ్చెక్కించడం పక్కా అనేట్టుగా కామెంట్ చేశాడు.
విజయ్‌కు జంటగా బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్‌లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే. ఇక పూరీ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమాగా వస్తున్న లైగర్ 100 పర్సెంట్ అంచనాలను అందుకుంటుందని చెప్పొచ్చు.