సమంతా ఎఫెక్ట్ కీ ఖుషి షూటింగ్ ఆగిపోయిందా..?

Kushi Shooting Update: లైగ‌ర్ సినిమా చేస్తున్న టైమ్ లోనే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే లైగ‌ర్ రిలీజ్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న జనగణమన అలాగే ఖుషి సినిమా షూటింగ్ కూడా ఆగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

విషయంలోకి వెళితే, ఖుషి సినిమాలో సమంతా హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత కొన్ని నెలల నుండి ఎటువంటి పోస్టులు పెట్టడం లేదు. అలాగే ఏమిటి అని ఆరాతీస్తే దీని పైన, తనకు స్కిన్ డిసీస్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే దీనికి సంబంధించి సమంత ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయా. ఈ ప్రచారంపై సమంతా గాని అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఎవరు అధికారికంగా ధృవీకరించనూ లేదు. అలా అని ఖండించనూ లేదు.

విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ని డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ఇంకా ముఫై రోజులకు పైగానే షూటింగ్ వర్క్ వుందని తెలుస్తోంది. సమంత డిసెంబర్ నుంచి షూటింగ్ కి వచ్చిన నా సినిమా మేకర్స్ ప్రకటించిన డేట్ కి విడుదల చేయవచ్చు.

అన్నీ అనుకున్నట్టు జరగకపోతే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ని ప్రీ సమ్మర్ కు వాయిదా పడే అవకాశాలు వున్నాయని ఫిలిం సర్కిల్ లో వార్త వినిపిస్తుంది. దీనిపై మరి కొన్ని రోజులు ఆగితే కానీ ఒక క్లారిటీ అనేది రాదు.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles