Latest Posts

తెరపైకి పెళ్లిచూపులు కాంబో మళ్లీ..!

- Advertisement -

Vijay devarakonda – Tharun Bhascker Movie details: ఒక హీరో ఒక దర్శకుడు కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే అదే కాంబినేషన్ సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుంది అంటూ ఎదురుచూసే జనాలు లేకపోలేదు.. పెళ్లిచూపులు అనే సినిమాతో విజయ్ దేవరకొండ అలాగే తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అలాగే స్టార్ హీరోగా మారారు ఆ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ఇప్పుడు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ రాబోతున్నట్టు తెలుస్తుంది.

అందుతున్న సమాచారం మేరకు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) అలాగే విజయ్ దేవరకొండ (Vijay devarakonda) సినిమా రాబోతుంది.. దీనికి సంబంధించిన కథ కూడా తరుణ్ ఇప్పటికే రెడీ చేసి హీరోకి వినిపించడం జరిగిందంట.. అలాగే విజయ్ కూడా కథకు ఓకే చెప్పేసి సినిమా మొదలుపెడదాం అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. అయితే చిన్న మీడియం సినిమాలు చేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు తనదంటూ కామెడీ అలాగే యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో భారీ బడ్జెట్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

అయితే తరుణ్ భాస్కర్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ సినిమా చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు.. అంతే కాకుండా ఇప్పటికే విజయ్ దేవరకొండ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది.. మరి ఉన్న ప్రొడ్యూసర్స్ కి అవకాశం ఇస్తారా లేదా అంటే కొత్త ప్రొడ్యూసర్ ఈ సినిమాని తెరకెక్కిస్తారా అనేది చూడాలి.. ప్రస్తుతానికైతే విజయ్ దేవరకొండ VD12 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Vijay devarakonda and Tharun Bhascker Movie details -Vijay Devarakonda next movie details, VD 12 shooting update, pellichoopulu combo on cards

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles