Vijay Deverakonda Became The Guest of Samantha Sam Jam talk show

Samantha Akkineni: Vijay Deverakonda:  స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్‌గా ఆహా వేదికపై కొత్త షో ‘సామ్ జామ్’ మీ ముందుకు రానుందని ఇటీవలే ప్రకటించిన అల్లు అరవింద్.. ఈ షోలో పాల్గొనబోయే మొదటి గెస్టుగా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను ఎంచుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు చూస్తుంటే ఈ షో మొదటి ఎపిసోడ్‌లో అక్కినేని కోడలు సమంతతో విజయ్ దేవరకొండ మ్యాజిక్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది. సమంత మరియు విజయ్ దేవరకొండలు మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా ఖచ్చితంగా ఆసక్తికర విషయాలు మాట్లాడుకుని ఉంటారు. ఈ సమయంలో సామ్ జామ్ లో విజయ్ దేవరకొండ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయమై క్లారిటీ ఇస్తూ ఫొటోలను షేర్ చేశారు.

సామ్ జామ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన విజయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సిల్వర్ కలర్ సూట్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో ఎప్పటిలాగే రౌడీ స్టార్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. మొత్తానికి సమంత ప్రతిష్టాత్మక సామ్ జామ్ షో మొదటి ఎపిసోడ్ ను చాలా స్టైలిష్ గా విజయ్ దేవరకొండ మార్చబోతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నారు విజయ్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.