Aishwarya Rajesh, Vijay Devarakonda, bellamkonda Srinivas, anupama parameswaran
Aishwarya Rajesh, Vijay Devarakonda, bellamkonda Srinivas, anupama parameswaran

రాఛ్చసన్,కణా…ఈ రెండు వేరు వేరు జోనర్స్ లో తెరకెక్కిన ఈ రెండు తమిళ్ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసాయి.దీంతో ఆ రెండు సినిమాలను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.ఏ రాఛ్చసన్ ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు పేరుతో తెలుగులోకి రీమేక్ చేసాడు డైరెక్టర్ రమేష్ వర్మ.ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.

విజయ్ దేవరకొండ సరసన క్రియేటివ్ కమర్షియల్స్ లో చేస్తున్న సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతుంది తమిళ్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్.అయితే అదే బ్యానర్ లో ఆమె నటించిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా కణా ని కూడా తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి పేరుతో భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కించారు.ఆ సినిమా టీజర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.ఈ రెండు సినిమాలు కూడా చాలా తక్కువ టైం లో తెరకెక్కాయి.అయితే వీటి రీమేక్ వెనుక పెద్ద సీక్రెట్టే ఉంది.

అదేంటంటే ఈ రెండు సినిమాల్లో మెయిన్ ఆర్టిస్టులు మారిన సీన్స్ తప్ప మిగతావన్నీ ఒరిజినల్ నుండే డైరెక్ట్ గా వాడుకున్నారు.రాక్షసుడు విషయానికి వస్తే శ్రీనివాస్,అనుపమ నటించిన సీన్స్ మాత్రమే మళ్ళీ ఫ్రెష్ గా తీశారు.మిగతా అంతా తమిళ్ మూవీ నుండి కాపీ,పేస్ట్.కౌసల్య కృష్ణమూర్తి లో కూడా సత్యరాజ్ ఉన్న సీన్స్ ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ తో రీమేక్ చేశారు.అలాగే మరికొంతమంది ఆర్టిస్టులు మారిన సీన్స్ మాత్రమే మళ్ళీ షూట్ చేసారు.

సినిమాలను ఇలా రీమేక్ చెయ్యడం వల్ల ఖర్చు తగ్గుతుంది,టైం కలిసొస్తుంది.నేటివిటీ కి సంబందించిన మార్పులు మ్యాండిటరీ.మిగతా సినిమాకి కేవలం డబ్బింగ్ మాత్రమే చెప్పిస్తే సరిపోతుంది.ఈ రెండు సినిమాలు త్వరలో రిలీజ్ అవుతున్నాయి.ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం తెలుగులో ముందు ముందు మరిన్ని సినిమాలు ఇదే పద్దతిలో రీమేక్ అయ్యే అవకాశం ఉంది.