Vijay Devarakonda ,Rashmika Mandanna, Dear Comrade,
Vijay Devarakonda ,Rashmika Mandanna, Dear Comrade,

డియర్ కామ్రేడ్…ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది.దీంతో ఆ సినిమా యూనిట్ కి సినిమాని రీ చెక్ చేసుకుని కూల్ గా ఫైనల్ కట్ రెడీ చేసుకోవడానికి చాలా టైం దొరికింది.దీంతో ఈ సినిమా టీమ్ రెగ్యులర్ గా లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉంది.రీసెంట్ గా అయితే సింగిల్ షాట్ లో తెరకెక్కించిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది.దానికి మంచి అప్లాజ్ వచ్చింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా తో పోటీ పడడానికి ఏ ఒక్క సినిమా కూడా సిద్ధంగా లేదు.అంత బజ్ ఉన్న ఈ సినిమాకి రీ షూట్ అనే తలనొప్పి మాత్రం తప్పడంలేదు.గతంలో సినిమాలో చాలా భాగం షూట్ చేసారు.అప్పటినుండి కంటిన్యూ గా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.దీంతో ఈ సినిమా కంటెంట్ ఒక కొలిక్కివచ్చినట్టే అనుకున్నారు అంతా.కానీ రిలీజ్ డేట్ దగ్గరలో పెట్టుకుని కూడా ఇంకా ఈ సినిమాని రీ షూట్ చేస్తున్నారు.దీన్ని బట్టి ఈ సినిమా అవుట్ ఫుట్ పై టీమ్,ముఖ్యంగా విజయ్ దేవరకొండ అంత కాన్ఫిడెంట్ గా లేదు అనే టాక్ స్ప్రెడ్ అవుతుంది.ఇకనయినా కామ్రేడ్ ఈ రిపెయిర్స్ ముగించుకుని పబ్లిసిటీ స్టార్ట్ చేస్తే గాని కంటెంట్ పై వచ్చే కామెంట్స్ ఆగవు.

[INSERT_ELEMENTOR id=”3574″]