విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్.. !

0
79
vijay devarakonda enter into Cinema theatre business and done pooja

Vijay devarakonda Enter into New Business: రౌడీ బ్రాండ్‌తో బట్టల దుకాణాన్ని ప్రారంభించి రౌడీ బాయ్‌గా మారిన Vijay Devarakonda ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ఆయన థియేటర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ ఫుల్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు.

ఈ స్టార్ హీరో ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహబూబ్‌ నగర్లో ఒక మల్టీప్లెక్స్‌ను ఆవిష్కరిస్తున్నారు. ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (AVD Cinemas) పేరుతో ఈ మల్లీప్లెక్స్ రూపొందగా, రీసెంట్‌గా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.

వాటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AVD సినిమాస్ లాంచింగ్ డేట్‌ని ప్రకటించనున్నారు. AVD సినిమాస్ లో ఈ ఏడాది దసరా నుండి సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.

vijay devarakonda enter into Cinema theatre business and done pooja

కాగా విజయ్ దేవరకొండ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో “లైగర్” అనే స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది.

Previous articleడ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నవదీప్‌
Next article‘పుష్ప’లో మరో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్..!