మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి విజయ్ దేవరకొండ

7320
Vijay Devarakonda Entering Into Multiplex Busine
Vijay Devarakonda Entering Into Multiplex Busine

తనదైన బాణీతో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. చిన్న పాత్రల స్థాయి నుంచి హీరోగా మారి ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమా చేస్తున్నాడు విజయ్. ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారం కూడా మొదలెట్టాడు.

 

ఈ రౌడీ బ్రాండ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఆ ఉత్సాహంతో విజయ్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. విజయ్ దేవరకొండ థియేటర్ బిజినెస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు.

 

 

ఏషియన్ సినిమాస్ తోనే కలసి మహేష్ బాబు ఆరంభించిన AMB సినిమాస్ సూపర్ సక్సెస్ అయింది. దాంతో అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అమీర్ పేట సత్యం థియేటర్ కొని మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.

 

 

ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మహేశ్, బన్నీ స్ఫూర్తితో ఏషియన్ సినిమాస్ తో కలసి విజయ్ స్వస్థలమైన మహబూబ్ నగర్ లో 3 థియేటర్స్ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. గతంలో తిరుమల థియేటర్ పేరుతో ఉన్న దానిని AVD (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో ఆరంభించనున్నారు. ఈ వేసవిలో వకీల్ సాబ్ తో ఏవీడీ సినిమాస్ ఆరంభం కానుండటం విశేషం.