vijay devarakonda facing challenges for dear comrade movie
vijay devarakonda facing challenges for dear comrade movie

విజయ్ దేవరకొండ హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా అతని క్రేజ్ మాత్రం అసామాన్యం.అర్జున్ రెడ్డి సినిమా యూత్ లో విజయ్ కి భారీ ఫాలోయింగ్ ని తీసుకొస్తే గీతగోవిందం విజయ్ ని అన్ని వర్గాల ఆడియన్స్ కి చేరువ చేసింది.కానీ ఆ తరువాత తెలుగు తమిళ్ బైలింగువల్ గా తెరకెక్కిన నోటా ఫస్ట్ షో కే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఆ సినిమా ప్లాప్ అని విజయ్ దేవరకొండ స్వయంగా ఒప్పుకున్నాడు.కానీ ఆ వెంటనే టాక్సీవాలా హిట్ అని డిక్లేర్ అవ్వడంతో విజయ్ క్రేజ్ రీ గెయిన్ అయ్యింది.

ఇప్పటివరకు విజయ్ సినిమా అయితే హిట్టు,లేదంటే ఫట్టు.విజయ్ కూడా నిజాయితీగా సినిమాలో ఎంత కంటెంట్ ఉంటే దానికి తగ్గట్టుగానే మాట్లాడాడు.కానీ ఇప్పుడు రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ పరిస్థితి వేరు.ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.ఇప్పుడు ఆ సినిమా హిట్టు అని విజయ్ స్ట్రాంగ్ గా ప్రోమోట్ చెయ్యగలడా?.రిలీజ్ కి ముందు ఈ సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ అన్నాడు…కానీ రిజల్ట్ మాత్రం అలా లేదు.పైగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 36 కోట్ల రేంజ్ లో జరిగింది.కానీ ఇప్పుడు వచ్చిన టాక్ తో ఆ మొత్తం రికవర్ అవుతుందా అంటే అనుమానమే.డియర్ కామ్రేడ్ లో ఎక్కువమంది కి కనెక్ట్ అయ్యింది లీడ్ పెయిర్ లవ్ స్టోరీ కి.కానీ అది చాలా క్లాస్ గా ఉంది.సో,మాస్ జనాలకు అది ఎకెక్కినట్టు కనిపించడం లేదు.నిజానికి విజయ్ దేవరకొండ ఇమేజ్ ని పట్టించుకోకుండా సినిమాకి హానెస్ట్ గా తీసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదట.అలాంటి ప్రయత్నాలు బాలీవుడ్ లో జరుగుతాయి.

కానీ మన దగ్గర ఇంకా ఆ కల్చర్ రాలేదు.అందుకే విషయం ఉన్న సినిమా ఇలా అరకొర రిజల్ట్ తో సరిపెట్టుకుంటుంది.మరి విజయ్ తన ఇమేజ్,క్రేజ్ తో ఈ సినిమా బయటపడేస్తే ఓకే.లేదంటే మాత్రం ఆ ఇంపాక్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తన తరువాతి సినిమాలపై పడే అవకాశం ఉంది.కానీ ఆల్రెడీ మాస్ హిట్ అనిపించుకున్న ఇస్మార్ట్ శంకర్,నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల ని దాటి డియర్ కామ్రేడ్ భారీ విజయం దక్కించుకోవడం కష్టమే.కెరీర్ లో ఫస్ట్ టైం గెలుపు,ఓటమిల మధ్యలో నిలబడ్డ విజయ్ దేవరకొండ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అనేది చూడాలి.