Vijay Devarakonda Created a sensation in the south.!
Vijay Devarakonda Created a sensation in the south.!

vijay devarakonda record: విజయ్ దేవరకొండ ఆనతి కాలంలోనే తనదైన మార్కుతో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ దక్షిణాదిలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని దక్కించుకున్నారు.

రౌడీ బ్రాండ్‌‌తో కొంతకాలం క్రితం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. బయటే కాదు సోషల్‌మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విజయ్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. అదేంటో తెలుసా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ సాధించుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని కలిగిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. అది కూడా తను ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంటరైన తక్కువ సమయంలోనే ఈ సంఖ్యను చేరుకోవడం మరో విశేషం.

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో “ఫైటర్” సినిమా బిజీలో ఉన్నాడు విజయ్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నది. పెళ్లి చూపులు చిత్రం తో హీరోగా మారి, అర్జున్ రెడ్డి చిత్రం తో యువత హృదయాలను కొల్లగొట్టాడు విజయదేవరకొండ. డైరెక్టర్‌ సుకుమార్‌‌తో చేసే క్రేజీ ప్రాజెక్టుపై కొద్దిరోజుల క్రితమే ప్రకటన వెలువడింది.