vijay devarakonda huge expensive new housewarming ceremony
vijay devarakonda huge expensive new housewarming ceremony

విజయ్ దేవరకొండ.. భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో..! అప్పుడెప్పుడో టాలీవుడ్ లోకి ఎంటర్ అయినా.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా లాంటి సినిమా హిట్లు అతని స్టార్ ను చేశాయి. నోటా, డియర్ కామ్రేడ్ నిరాశపరిచినా అతనికి ఉన్న స్టార్డమ్ అలాగే కొనసాగుతోంది. వరల్డ్ గ్రేటెస్ట్ లవర్, హీరో సినిమాలు విడుదలకు రెఢీగా ఉన్నాయి. మన రౌడీ బాలీవుడ్ బాట పట్టే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో విజయ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. గృహ ప్రవేశం జరిగిందని.. తన కుటుంబసభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నామంటూ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పలువురు అభిమానులు కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. ఆ ఫ్యామిలీ ఫోటోలో వదిన లేని లోటు కనిపిస్తోంది.. తొందరగా పెళ్లి చేసుకో అన్నా అని కామెంట్లు కూడా పెడుతున్నారు.

విజయ్ దేవరకొండ తన ఇంటి కోసం భారీగా ఖర్చు చేశాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. అన్ని సదుపాయాలూ ఉన్న పెద్ద విలాసవంతమైన ఇంటిని కొన్ని కోట్లు ఖర్చు చేసి కట్టించుకున్నారని చెబుతున్నారు. 15 నుంచి 20 కోట్లు పెట్టి కొన్నట్టు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా.. ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది ఈ ఇల్లు. విజయ్ కు నచ్చినట్లు ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నట్లు కూడా తెలిసిపోయింది. కెరీర్ ఊపులో ఉంది.. సొంత ఇల్లు కూడా ఉంది.. ఇక మిగిలింది.. విజయ్ పెళ్లి మాత్రమే..! ఇప్పటికే విజయ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ రూమర్స్ వచ్చాయి.. అది నిజమో కాదో తెలియాలి.