Vijay Devarakonda Kushi OTT Platform & Deal: విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఖుషి సినిమాలో సమంత (Samantha) హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మొదటి పాట తో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఖుషి షూటింగ్ చివరి దశలో ఉండటం అలాగే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తి అయినట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Vijay Devarakonda Kushi OTT Platform & Deal: సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతున్న ఖుషి సినిమా ప్రస్తుతం కేరళ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ అలాగే సమంత రెండోసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కి భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఖుషి సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ (OTT) భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఖుషి సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసిందంట. అయితే ధర ఎంత అనేది తెలియాల్సి ఉంది.. దీనిపై మేకర్స్ కూడా త్వరలోనే ప్రకటన చేస్తారని సమాచారం. ఈ సినిమాకి హీషం అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ అలాగే సమంత కూడా ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. శకుంతలం సినిమా తర్వాత రాబోతున్న సమంత సినిమా కావటంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విడుదలపై ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత VD12,VD13 ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టడం జరిగింది.