Homeసినిమా వార్తలు‘ఖుషి’ నుండి ఫోర్త్ సింగిల్ 'యెదకే ఒక గాయం'..!

‘ఖుషి’ నుండి ఫోర్త్ సింగిల్ ‘యెదకే ఒక గాయం’..!

Vijay Deverakonda and Samantha's Kushi Fourth Single "Yedhaki Oka Gaayam" releasing Thursday evening in all 5 languages, Kushi movie songs, Kushi 2023 movie latest news

Vijay Devarakonda Kushi Songs: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ . ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

Vijay Devarakonda Kushi Songs: ఇప్పటికే విడుదలైన ఖుషి ట్రైలర్ అలాగే సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనాల పెంచాయి. అదేవిధంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో విజయ్ దేవరకొండ అలాగే సమంత ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ కన్సర్ట్ లో పాల్గొన్న ఆడియెన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ గా ‘ఖుషి’ నాలుగో పాటను వినిపించారు. యెదకు ఒక గాయం అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలో లవ్ పెయిన్ తెలిపే ఎమోషనల్ పాటగా దీన్ని చిత్రీకరించారు.

అయితే కృషి స్టోరీ పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి కానీ వీటి గురించి సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్లు గానీ లేదంటే డైరెక్టర్ గాని ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఖుషి స్టోరీ ఇంచుమించు మాధవన్ నటించిన సఖి సినిమా లాగా ఉంది అంటూ చాలా కథనాలు అయితే నడుస్తున్నాయి. విజయ్ దేవరకొండ లైగర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్యాన్స్ నిరుత్సాహపరచక అదేవిధంగా సమంత కూడా శాకుంతలం సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అలాగే సమంత భారీగానే అంచనా పెట్టుకున్నారు.

Vijay Deverakonda and Samantha's Kushi Fourth Single release date
Vijay Deverakonda and Samantha’s Kushi Fourth Single release date

ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వరుసగా రెండు సినిమాలను విడుదల చేయుటకు సన్నహాలు చేస్తున్నారు. గీతా గోవిందం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురామ్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాని తరికేస్తున్నారు. దేనితోపాటు గౌతమ్ తిన్ననూరి తో పోలీస్ బ్యాగ్రౌండ్ లో ఒక సినిమాని ప్రారంభించారు. వీటితోపాటు మరికొన్ని సినిమాలను కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY