VD LIGER క్లైమాక్స్ కోసం1000 మంది..?

0
46
Vijay devarakonda Liger climax scene update goes viral

Vijay Devarakonda Liger: డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లైగర్‌’ (LIGER). ఇందులో విజయ్‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) నటిస్తుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ – ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ ను నిర్మాణ భాగస్వామిగా చేశారు.

ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం.. ప్రభుత్వాలు షూటింగ్ (Shooting) లకు అనుమతి ఇవ్వడంతో ‘లైగర్’ (LIGER) చిత్రాన్ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ముంబై లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ క్రమంలో లైగర్‌ (LIGER) నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

Vijay devarakonda Liger shooting update

‘లైగర్’ మూవీ షూటింగ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్ సీన్ హైలెట్‏గా నిలువనుందట. క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ కోసం సుమారు వెయ్యి మందికి పైగా అవసరం ఉందని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో షూటింగ్ అంటే రిస్క్ తో కూడుకున్న పని అని వీడీ అన్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో రౌడీ దేవరకొండ ఓ కిక్ బాక్సర్ గా కనిపించనున్నాడు. దీని కోసం యంగ్ హీరో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడమే కాకుండా భారీ వర్కవుట్స్ చేసే బాడీ బిల్డ్ చేసారని తెలుస్తోంది. ‘లైగర్’ (LIGER) కోసం జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ (Hollywood) స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ వర్క్ చేస్తున్నారు. ఆయన సారధ్యంలోనే స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.