సుకుమార్ పీరియాడిక్‌ మూవీలో విజయ్‌దేవరకొండ..?

0
213
Vijay Devarakonda May Role As Soldier In Sukumar Movie

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఊపు మీదున్నాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలోఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2022లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఈయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా కాంబినేషన్లో సినిమా ప్రకటిస్తే.. దాని కథ, తారాగణంపైనా గాసిప్స్ మొదలవుతాయి. ఇలాగే సుకుమార్-విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. లేటెస్ట్‌ సమాచారం ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సిపాయి పాత్రలో కనిపిస్తాడని, ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు.

ఈ వార్త నిజమో.. కాదో తెలియాలంటే యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే సినిమా సినిమాకి పూర్తి వైవిధ్యం చూపించే సుకుమార్ విజయ్‌ని సరికొత్తగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. మరోవైపు సుకుమార్‌ కూడా బన్నీతో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరూ ఇప్పటికే కమిట్‌ అయిన చిత్రాలను పూర్తి చేసుకుని 2022లో ఈ సినిమా కోసం సెట్స్‌ మీదకు వెళ్లనున్నారు.

Previous articleబుల్లితెర నటి చిత్ర చేసిన సినిమా ‘కాల్స్’ విడుదలకు సిద్ధమైంది
Next articleBB4: అభిజీత్ అభిమానులపై మోనాల్ పోలీస్ కేసు..!