Amazon Prime, Dear Comrade Movie, Vijay Devarakonda, Rashmika Manadanna
Vijay Devarakonda Next _Hero_ Film Budget Issues, Latest News

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న టైం లో విజయ్ దేవరకొండ కి పెద్ద స్పీడ్ బ్రేకర్ లా నిలిచింది డియర్ కామ్రేడ్.విజయ్ మార్కెట్ ని డిసైడ్ చేస్తుంది అని మాట్లాడుకున్న ఈ సినిమా కి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం దారుణంగా వచ్చాయి,వస్తున్నాయి.దీంతో విజయ్ తో హీరో అనే 50 కోట్ల సినిమా ప్లాన్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ ని కుదించే పని మొదలుపెట్టింది అని టాక్.

ఈ సినిమా డైరెక్టర్ ఆనంద్ అన్నామలై కథ చెప్పినంత ఎఫెక్టివ్ గా సీన్స్ తియ్యలేకపోతున్నాడు అని టాక్.6 కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ లో తీసిన రేసింగ్ సీన్స్ అనుకున్నట్టు రాలేదు.హీరో విజయ్ తో పాటు,నిర్మాతలు కూడా హ్యాపీ గా లేరు.అందుకే ఆ రేసింగ్ సీన్స్ తగ్గిస్తూ,సినిమా బడ్జెట్ కూడా కాస్త తగ్గేలా స్క్రిప్ట్ పై రీ వర్క్ చెయ్యమన్నట్టు టాక్.ఆ స్క్రిప్ట్ లాక్ అయ్యాక మళ్ళీ హీరో షూటింగ్ మొదలవుతుంది.

ఈ సినిమాని తెలుగు,తమిళ్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు 50 కోట్ల బడ్జెట్ ఓకే అనుకున్నారు.కానీ సినిమా హిట్ కాకపోతే విజయ్ ఎంతవరకు బడ్జెట్ రికవరీ చెయ్యగలడు అనేది డియర్ కామ్రేడ్ తో తేలిపోయింది.ఆ సినిమాని ఎంతగా ప్రోమోట్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది.అందుకే విజయ్ కూడా రియలైజ్ అయ్యి హీరో సినిమాని తాత్కాలికంగా వాయిదా వెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అంటున్నారు.మరి హీరో ఎప్పుడు మొదలవుతుందో,ఎప్పుడు పూర్తవుతుందో,ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే ప్రశ్నలకి ప్రస్తుతానికి ఆన్సర్ లేనట్టే.