విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ !

0
76
World Famous Lover Movie, First Look, Vijay Devarakonda, Raashi Khanna, Latest Movie News
World Famous Lover Movie, First Look, Vijay Devarakonda, Raashi Khanna, Latest Movie News

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అని టైటిల్ పెట్టారు. ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.ప్రస్తుతం రొమాంటింక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామరావు నిర్మిస్తున్నారు. కాగా సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ముగ్గురు హీరోయిన్లకు విజయ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్ పాత్రలు కథ పరంగా చాలా ముఖ్యమైనవని.. హీరో పాత్రకు సమానంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇక విజయ్‌ దేవరకొండతో ఇటీవలే ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్‌ చిత్రానికి పాటలందించిన గోపీసుందర్‌ నే ఈ చిత్రానికి కూడా స్వరాలనందిస్తున్నారు. కాగా గత కొన్ని నెలలుగా క్రాంతి మాధవ్ మరియు కె.ఎస్ రామారావు ఇద్దరూ ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌ కి ఏ టైటిల్ పెట్టాలా అని అన్ని రకాలుగా ఆలోచించి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. ఇక ‘డియర్ కామ్రేడ్’తో ఆశించిన విజయం సాధించలేక పోయిన విజయ్ దేవరకొండ ఈ సినిమా పై చాల ఆశలు పెట్టుకున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here