Vijay Devarakonda Nikhil Sharwanand Sai Dharam Tej Nithin in Confusion
Vijay Devarakonda Nikhil Sharwanand Sai Dharam Tej Nithin in Confusion

సినిమా ఇండస్ట్రీ లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలి అంటే గతంలోలా సాదా సీదా కంటెంట్ తో వస్తుంటే సరిపోవట్లేదు.ఉదాహరణకి విజయ్ దేవరకొండ ని తీసుకుంటే అతని కెరీర్ ని మలుపు తిప్పిన పెళ్లి చూపులు,ఇండస్ట్రీ తీరునే మార్చిన అర్జున్ రెడ్డి బోల్డ్ నెర్రేషన్…ఈ రెండూ కూడా ఫ్రెష్ స్టఫ్ తో వచ్చిన సినిమాలు.అయితే గీతగోవిందం కాస్త రొటీన్ సినిమా అయినా ఎవర్ గ్రీన్ ఫార్ములా అయిన ఎంటర్టైన్మెంట్ ని అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అయితే ఆయా సినిమాల విజయంలో కథ,డైరెక్టర్స్ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయిన విజయ్ డియర్ కామ్రేడ్ తో దెబ్బ తినేసాడు.డియర్ కామ్రేడ్ విజయ్ కాన్ఫిడెన్స్ ని పూర్తిగా కిల్ చేసింది.అందుకే ఎప్పటినుండో పెండింగ్ లో పెట్టిన పూరి ప్రాజెక్ట్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అంతే కాదు చూద్దాం చూద్దాం అన్న దిల్ రాజు సినిమా కూడా చేద్దాం అనే సిట్యుయేషన్ ఏర్పడింది.ఎలాంటి సినిమా చేస్తే హిట్ వస్తుంది అన్న క్లారిటీ లేకపోవడం వల్ల విజయ్ కి ఈ పరిస్థితి వచ్చింది.

స్వామి రారా,కార్తికేయ సినిమాలతో డిఫరెంట్ సినిమాలకు అంబాసడర్ అనిపించుకున్న నిఖిల్ అయితే కెరీర్ ఎటు వెళుతుందో తెలియని గందరగోళంలో ఉన్నాడు.తమిళ్ సినిమా కనితన్ ని తెలుగులో రీమేక్ చెయ్యాలి అని ఆలోచన వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది.అప్పటినుండి ఇప్పటివరకు నిఖిల్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు.కనితన్ రీమేక్ అర్జున్ సురవరం ఒక సారి పేరు మార్చుకుంది,అనేక సార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది.ఇప్పటికీ ఎప్పుడు వస్తుందో తెలియదు.డిఫరెంట్ కాన్సెప్ట్ అని స్టార్ట్ చేసిన శ్వాస అనుకోకుండా ఆగిపోయింది.నిఖిల్ కెరీర్ లో బెస్ట్ సినిమా అయిన కార్తికేయ సీక్వెల్ అయిన కార్తికేయ-2 స్క్రిప్ట్ కూడా పూర్తికాలేదు.ఈ లోగా ఆ సినిమా డైరెక్టర్ వేరే హీరో వైపు చూస్తున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఉన్న నిఖిల్ ఇప్పుడు ఎలాంటి సినిమా ఎంచుకుంటాడు అనేది కూడా క్యూరియస్ థింగ్.

కొత్తదనం ఉన్న కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నా సరయిన హిట్ ఒక్కటికూడా పడని నారా రోహిత్ ఈ మధ్య కామ్ అయ్యాడు.నచ్చని కమర్షియల్ సినిమాలు చెయ్యలేక,నచ్చి చేసిన వెరైటీ సినిమాలు హిట్ అవ్వక ఎలాంటి సినిమా చేస్తే విజయం వరిస్తుంది అన్న కన్ఫ్యూషన్ లో ఉండిపోయాడు.గమ్యం,అమ్మ చెప్పింది,ఎక్ష్ప్రెస్స్ రాజా,మహానుభావుడు లాంటి డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుని వాటితో మ్యాక్సిమమ్ హిట్స్ అందుకున్నాడు శర్వానంద్.మధ్యలో రొటీన్ గానే అనిపించిన రన్ రాజా రన్,శతమానం భవతిసినిమాలు కూడా విజయం సాధించాయి.అందుకే పడి పడి లేచే మనసు అనే రొటీన్ అండ్ లవ్ ఎంటెర్టైనెర్ చేసాడు.కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మాస్ బాట పట్టి రణరంగం చేస్తున్నాడు.మరి ఆ సినిమా రిజల్ట్ ని బేస్ చేసుకునే తన తరువాతి సినిమాలను లైన్ అప్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు శర్వానంద్.

రాజ్ తరుణ్ కి ఒకప్పుడు ఎందుకు హిట్స్ వచ్చాయో,ఇప్పుడు ఎందుకు రావట్లేదో తెలియదు,అలాగే RX100 హీరో కార్తికేయ కూడా ఎలాంటి కథలు ఎంచుకోవాలి అనే డైలమా లో ఉన్నాడు.సాయి ధరమ్ తేజ్ కి చిత్రలహరి తో కాస్త క్లారిటీ వచ్చినా ఇంకా నమ్మకం కుదరలేదు.నాగ శౌర్య,నితిన్ ల పరిస్థితి కూడా ఇంతే.ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఇండస్ట్రీ లో హిట్ ట్రెండ్ ఏది అనే అంచనా వెయ్యలేక కుర్ర హీరోలంతా కంగారు పడుతుంటే,సీనియర్ హీరోస్ మాత్రం అడపాదడపా హిట్స్ అందుకుంటూ,ఆడుతూ పాడుతూ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు.ఇదోరకం వెరైటీ.

 

Consider these articles: