Vijay Devarakonda Rashmika Dear Comrade Highest Pre Release Business
Vijay Devarakonda Rashmika Dear Comrade Highest Pre Release Business

విజయ్ దేవరకొండ అలియాస్ రౌడీ.తనకు తానే అలాంటి నెగెటివ్ ఇమేజ్ తో చాలా వాల్యూ ఉండేలా ఒక బ్రాండ్ మార్క్ ఏర్పరుచుకున్నాడు.అందుకే అతని సినిమా వస్తుంది అంటే ట్రేడ్ తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా అలెర్ట్ అవుతారు.ఇక డియర్ కామ్రేడ్ కోసం అయితే స్వయంగా రంగంలోకి దిగాడు.హీరోయిన్ రష్మిక మందన్న తో కలిసి డియర్ కామ్రేడ్ మ్యూజికల్ ఫెస్టివల్ కి వెళ్ళి సౌత్ లాంగ్వేజెస్ లో సినిమాకి కావాల్సిన బజ్ క్రియేట్ చేసాడు.అందుకే ఈ సినిమా థియేటర్ హక్కులు ఏకంగా 34 కోట్ల 60 లక్షలకు అమ్ముడుపోయాయి.ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సినిమాల్లో హయ్యెస్ట్ బిజినెస్ చేసిన సినిమా ఇదే.డియర్ కామ్రేడ్ మినిమమ్ 50 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది అని అంచనా.

ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి వెళ్లబోతున్నాడు.ఈ సినిమాకి సౌత్ లో వస్తున్న బజ్ చూసి ఇప్పటికే చాలా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు రీమేక్ రైట్స్ కోసం ఎదురు చూసినా కూడా విజయ్ హోల్డ్ చేసి ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ కి అమ్మించాడు.దీంతో కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ లో డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో తన కెరీర్ స్టార్ట్ చెయ్యబోతున్నాడు విజయ్.ఇప్పటికే తెలుగు నుండి హిందీ లోకి డబ్ అయిన సినిమాల ద్వారా విజయ్ కి అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.అందుకే ఇప్పుడు కరణ్ జోహార్ విజయ్ ని లాంచ్ చేస్తున్నాడు.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ నటించే అవకాశాలున్నాయి.ఇప్పటివరకు సౌత్ కి మాత్రమే పరిమితమయిన ఈ రౌడీ బాక్స్ ఆఫీస్ తాకిడి బాలీవుడ్ ని కూడా కుదిపెయ్యబోతుంది.