Vijay Devarakonda, Rashmika Mandanna, Dear Comrade, Tollywood Movie News
Vijay Devarakonda, Rashmika Mandanna, Dear Comrade, Tollywood Movie News

విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమా కూడా కూల్ గా థియేటర్ కి వస్తున్న దాఖలాలు లేవు.గీతగోవిందం,టాక్సీవాలా సినిమాలు రిలీజ్ కి ముందే లీక్ బారిన పడ్డాయి.ఇక ఇప్పుడు లైన్ లో ఉన్న డియర్ కామ్రేడ్ కూడా ఎప్పుడు రిలీజ్ అనుకున్నా ఎదో ఒక గందరగోళం ఏర్పడి ఆగిపోతుంది.ఇప్పటికే సినిమా చాలా వరకు రీ షూట్ చేశారు.అయినా విజయ్ ఇంకా ఆ సినిమా పై పూర్తిగా కాన్ఫిడెంట్ గా లేదు అనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యింది.

అందుకే ఇంకా ఆ సినిమాకి సంబందించిన టీజర్ అండ్ ట్రైలర్ లాంటివి రిలీజ్ చెయ్యలేదు అనుకున్నారు అప్పట్లో.అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అనుకున్న జులై 26 కి వారం ముందు హాలీవుడ్ క్రేజియెస్ట్ మూవీ లయన్ కింగ్ కూడా రీలీజ్ అవుతుంది.ఆ సినిమా క్రేజ్ వల్ల మూడు వారల పాటు తెలుగు సినిమాలను పట్టించుకోవడం కష్టం.అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ నుండి సినిమా రిలీజ్ డేట్ మార్చమని ప్రొపోజల్స్ వస్తున్నాయి.లైట్ తీసుకుందామా అంటే గీతగోవిందం,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు అక్కడ మ్యాజిక్ క్రియేట్ చేసాయి.మరి ఈ కామ్రేడ్ ముందు ఉన్న కష్టాలు ఎప్పటికి తీరుతాయో.ఎప్పుడు ప్రేక్షకులముందుకు వస్తాడో చూడాలి.