విజయ్ దేవరకొండ ‘లైగర్‌’ షూటింగ్‌ మొదలెట్టాడు..!

0
559
Vijay Devarakonda Resume Liger shoot from today

Liger Shooting Update: విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. బుధవారం కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా “లైగర్” సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైందని రౌడీ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ రోజు సాయంత్రం గోవాలో జరిగే నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం బృందం భారీ సెట్‌ను ఏర్పాటు చేసింది.

చొక్కా లేకుండా బాక్సింగ్ బరిలోకి దిగిన సన్నివేశంలా అనిపిస్తుంది. ‘రక్తం.. చెమట.. హింస’ అంటూ ఈ ఫొటోకి విజయ్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఒక్క లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. విజయ్‌తోపాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

Vijay Devarakonda Resume Liger shoot from today

రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రం సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో సినిమా ఓటిటి లో విడుదలవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో “లైగర్” కు రూ. 200 కోట్ల ఓటిటి డీల్ వచ్చినందంటూ వస్తున్న రూమర్‌ని కొట్టిపారేశారు.

 

Previous article“ఎన్టీఆర్ 30” లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
Next articleమహేష్ బాబు సర్కారు వారి పాట టీమ్ రెడీ..!