VD13 Title and Shooting Update: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అలాగే సమంత కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఖుషి (Kushi) మరో 15 రోజుల్లో అనగా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు పరశురామ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. VD13 అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకి ప్రస్తుతం రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖుషి తర్వాత విజయ్ చేస్తున్న సినిమా ఇదే అన్న సంగతి తెలిసిందే.
VD13 Title and Shooting Update: ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. సీతారామ్ తో భారీ హిట్ కొట్టి తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న మృణాల్ ఓ వైపు నాని “హే నాన్న”, మరోవైపు విజయ్ తో ” ఫ్యామిలీ స్టార్” (Family Star) చేస్తున్నారు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ని పెట్టేందుకు టీం సిద్ధమైనట్టు తెలుస్తుంది. విజయ్ దేబరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మృణాల్‌తో పాటు మరో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.
ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దివ్యాన్ష కౌశిక్ ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. నాగ చైతన్య, రవితేజ్ సినిమాలతో పాటు రీసెంట్ గా సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న టక్కర్ సినిమాలో కూడా దివ్యాన్షకు అవకాశం వచ్చింది. మరి విజయ్ దేవరకొండ సినిమాతో అయినా తన ఫేట్ మారిద్దో లేదో చూడాలి.. తయారీదారు విజయ్ ఫ్యామిలీ స్టార్‌ని భారతదేశం అంతటా విడుదల చేయాలని యోచిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.పొంగల్ రేస్‌లో మరిన్ని సినిమాలు ఉంటే మార్చి, ఏప్రిల్‌లో సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటే విజయ్ దేవరకొండ గౌతమ్ తిననూరి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి విజయ్ లైన్ అప్ చూస్తే రాబోయే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించేలాగే ఉన్నాయి.