ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమా..?

0
428
vijay devarakonda will make his bollywood debut based on the balakot airstrike

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటికి వచ్చింది. అర్జున్‌రెడ్డితో భారీ క్రేజ్ సంపాదించుకున్నా ఈ రొమాంటిక్ హీరో ఆ తర్వాత ‘గీతగోవిందం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కూ దగ్గరయ్యాడు. అతని స్టైలింగ్, యాటిట్యూడ్ ఇలా మిగతా హీరోలకంటే భిన్నంగానే ఉంటుంది. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నాడు పూరి. ఈ సినిమా కాకుండా విజయ్ త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. భారత వింగ్‌కమాండర్‌ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు విజయ్ పచ్చజెండా ఊపినట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్న సినిమాలో విజయ్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది.

బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ ఆధారంగా అభిషేక్ కపూర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం . 60 గంటలు పాకిస్తాన్ లో బందీ గా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాత్రను విజయ్ పోషించనున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ లతో కలిసి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడట అభిషేక్ కపూర్. స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Previous articleRadhe Shyam unit plans to shoot romantic seens with prabhas and pooja
Next articleVijay Devarakonda Will Make His Bollywood Debut With Real Story ?