అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పేరు ఒక బ్రాండ్ గా మారింది. ఈ సినిమా తర్వాత తను చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తన ఫాలోయింగ్ ఎక్కడ మారలేదు. అయితే రీసెంట్గా వచ్చిన ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. సమంత హీరోయిన్గా చేసిన ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.
అయితే బాక్సాఫీస్ వద్ద ఇంకా బ్రేకింగ్ కావాల్సి ఉంది. 53 కోట్ల భారీ టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం 32 కోట్లని కలెక్ట్ చేయగలిగింది నాలుగు రోజుల్లో. ఇవి సోషల్ మీడియాలో తిరుగుతున్న లెక్కలు. అయితే అధికారికంగా ఇంతవరకు ఎంతవరకు కలెక్ట్ చేసింది బాక్సాఫీస్ వద్ద అనేది తెలియాల్సి ఉంది. ఖుషి సినిమా సక్సెస్ అవటంతో సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్లు అలాగే నటీనటులు విశాఖపట్నంలో నిన్న సక్సెస్ మీట్ని పెట్టడం జరిగింది. .
ఈ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మీ ఫేసుల్లో ఆనందం చూశాను అదే నాకు చాలు దర్శకుడు శివా కూడా సినిమా చేసే ముందు ఒక క్యూట్ రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ స్టోరీ తీద్దాం అంటూ ప్రారంభించాము అలాగే మీరందరూ ఈ సినిమాని ఇంతగా ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది..
మీ అభిమానాన్ని అలాగే ప్రేమని నాపై చూపిస్తున్నందుకు ఈ సంతోషం సరిపోదు అంటూ మీకు ఏదో చేయాలని ఉంది అని కోటి రూపాయల భారీ విరాళాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలకి ఇస్తున్నట్టు చెప్పారు.. ఈ కోటి రూపాయల విరాళాన్ని 100 ఫ్యామిలీస్ కి త్వరలోనే గుర్తించి వారికి నేరుగా నేనే చెక్కు ఇస్తానంటూ చెప్పటం కూడా జరిగింది.