లైగర్ అప్డేట్: గోవాలో భారీ యాక్షన్ షెడ్యూల్

0
153
Vijay Deverakonda Liger New Schedule To Start In Goa From Next Week

Vijay Deverakonda Liger: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి.

విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్` తదుపరి షెడ్యూల్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే అన్ని సందేహాలకు సమాధానమిస్తూ.. ఎట్టకేలకు గోవాలో యాక్షన్ ప్యాక్ షెడ్యూల్ కోసం సర్వసన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది.

ఈ షెడ్యూల్ ఏకంగా నెలరోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలతో పాటు ఒకట్రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాల టాక్. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్రయూనిట్ చివరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళుతుంది.

Vijay Deverakonda Liger New Schedule To Start In Goa From Next Week

ఇందులో విజయ్ – విదేశీ యోధులతో కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తారు. బాలీవుడ్ అందాల కథానాయిక అనన్య పాండే లైగర్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. పూరీతో కలిసి ఈ సినిమాను ఛార్మీ ప్రొడ్యూస్ చేస్తోంది.