మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ ..!

0
54
vijay devarakonda fulfilled his promise for singing chance to shanmukha priya

Liger Song: ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ సందర్భంగా ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్.

తాజాగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. షణ్ముఖ ప్రియని కలిసి, ఆమెతో ముచ్చటించిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకున్నారు. ‘విజయ్‌ దేవరకొండకి నేను అభిమానిని. అలాంటి ఆయన నా గురించి మాట్లాడతారని, నాకు మద్దతిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నేను నమ్మలేకపోతున్నా’ అని విజయ్‌ని కలవకముందు షణ్ముఖప్రియ మనసులోని మాట ఇది. ఈ విషయాన్నే ఇప్పుడు విజయ్‌ షేర్‌ చేసిన వీడియోలో చూపించారు.

షణ్ముఖ ప్రియ ఆమె తల్లి హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళగా… ఫైనల్ మిక్సింగ్ పూర్తయిన వెంటనే షణ్ముక ప్రియ పాడిన పాట వినవచ్చని కూడా చెప్పాడట. అంతే కాదు విజయ్ మదర్ సింగర్ షణ్ముక ప్రియను సన్మానించి చీరలు, బహుమతులను అందజేశారు.

Vijay Deverakonda makes Shanmukhapriya sing for Liger

విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.