విజయ్ దేవరకొండ మరియు పరశురామ్ కలిసి సినిమా చేయబోతున్నారన్న విషయాన్ని కొద్ది రోజుల ముందు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గీత గోవిందం మరియు సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన పరశురామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తుండగా , క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించనున్నారు.
ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. హైదరాబాదులో ఈరోజు ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షార్ట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు, ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరాను స్విచ్ ఆన్ చేశారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అందరినీ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది.

నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ మొదటిసారి వారితో చేతులు కలిపారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఇక మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది.


Web Title: Vijay Deverakonda, Mrunal Thakur, Parusuram starrer VD13 / SVC 54 gets officially launched.. VD13 shooting update, VD13 pooja ceremony photos, VD13 launch photos, VD13 shooting update, VD13 shooting location,