అది కొద్ది చిత్రాలు నటించినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గీతాగోవిందం మూవీతో చెరగని ముద్ర వేశాడు. క్లాస్ క్యారెక్టర్ అయినా మాస్ క్యారెక్టర్ అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించే రౌడీ గత కొద్ది కాలంగా మంచి సక్సెస్ లేక బాధపడుతున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఊహించిన ఫలితాలను అందించ లేకపోయింది. ఈ మూవీలో ఫైట్స్ కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ విజయ్ దేవరకొండకు సక్సెస్ మాత్రం అందలేదు. రొమాంటిక్ లవ్ మరియు ఎమోషనల్ కాన్సెప్ట్స్ తో రూపొందుతున్న ఖుషి (Kushi) చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ మూవీలో సమంత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సమంత అనారోగ్య కారణాలు మరియు ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ బాగా డిలే అవుతూ వస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంతో పాటుగా గౌతం తిన్నూరుతో మూవీకి విజయ్ దేవరకొండ VD12 గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో ఉంటుంది అని తెలుస్తుంది.
అయితే ఈ మూవీస్ తో పాటుగా రౌడి దిల్ రాజ్ బ్యానర్ పై పరశురామ పట్ల కాంబోలో మరో మూవీకి ఓకే చెప్పాడట. దీంతోపాటుగా శ్యామ్ సింగ రాయ్ మూవీ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) రీసెంట్ గా విజయ్ తో (Vijay deverakonda) పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ (period action drama) కాన్సెప్ట్ తో వస్తున్న స్టోరీ వినిపించారట. కాన్సెప్ట్ విపరీతంగా నచ్చడంతో విజయ్ ఈ మూవీకి కూడా ఒకే చెప్పారు అని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. ఈ ఏడాది మొత్తానికి రౌడీ వరుసలు అయినప్పటితో బాగా బిజీగా ఉన్నారు.
Web Title: Vijay deverakonda new movie under Rahul Sankrityan director, Vijay Deverakonda okays a period action drama on cards, Vijay Deverakonda next movie, Vijay Deverakonda new movie details, Vijay Deverakonda and Rahul Sankrityan next period action drama