సమీక్ష : డియర్ కామ్రేడ్ – సో స్లో కామ్రేడ్

Vijay Deverakonda, Rashmika Dear Comrade Movie Review Rating
Vijay Deverakonda, Rashmika Dear Comrade Movie Review Rating

విడుదల తేదీ : జూలై 26, 2019
రేటింగ్ : 2.75/5
నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మందన,శృతి రామచంద్రన్
దర్శకత్వం : భరత్ కమ్మ
నిర్మాత‌లు : నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి, యాష్ రంగినేని
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్

అర్జున్ రెడ్డి గితగోవిందం సినిమాల సక్సెస్ తో అసాధారణమైన క్రేజ్ ని భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.మధ్యలో నోటా షాకిచ్చిన టాక్సివాలా తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.అయితే విజయ్ స్టామినాని అతని రేంజ్ ని డిసైడ్ చేసే సినిమాగా కనిపించింది.డియర్ కామ్రేడ్. ఈ సినిమాలో గీత గోవిందం హిట్ పెయిర్ కలసి నటించడం టీజర్ అండ్ ట్రైలర్ కూడా మ్యూజికల్ ఇంపార్టెన్స్ తో పోయాటిక్ గా ఉండడంతో కామ్రేడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దానికి తోడు సౌత్ లోని అన్ని భాషలలో ఈ సినిమా రిలీక్ అవుతుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి.ఇక స్వయంగా విజయ్ దేవరకొండ రంగం లోకి దిగి అలుపు లేకుండా చేసిన ప్రమోషన్స్ వల్ల డియర్ కామ్రేడ్ చూసి తీరాలి అని డిసైడ్ అయిపోయారు చాలా మంది.అంత హ్యూజ్ క్రేజ్ తో, భారీ ప్రిరిలీజ్ హైప్ తో థియేటర్స్ లోకి వచ్చిన డియర్ కామ్రేడ్ ఎలా వున్నాడు. గీత గోవిందం మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ మరో బ్లాక్ బస్టర్ ని దక్కించుకున్నాడా, లేదా, ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు అందుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

కామ్రేడ్ నేపధ్యం కల కుటుంబం లో పుట్టిన చైతన్య అలియాస్ బాబీ చాలా ఎగ్ రిసీవ్ గా ఉంటాడు.ఎవరికైనా అన్యాయం జరిగినా, తన వాళ్లకు కష్టం వచ్చినా ఆవేశంతో కొట్లాటలకు దిగుతాడు. అలాంటి చైతన్య…… స్టేట్ లెవల్ క్రికెటర్ అపర్ణయా దేవి అలియాస్ లిల్లీ ని చూసి… క్రికెట్ పట్ల ఆమె కున్న ప్యాషన్ నచ్చి ఆమెను ప్రేమిస్తాడు. కానీ చైతన్య షార్ట్ టెంపర్ వల్ల లిల్లీ అతన్ని రిజెక్ట్ చేస్తుంది. కానీ మళ్ళీ ఇద్దరు తమలోని ప్రేమను రియాలైజ్ అయ్యి కలుసుకుంటారు. ఈలోగా చైతన్య… కాలేజి నేపథ్యంలో జరిగిన ఘర్షణ లో తీవ్రంగా గాయ పడతాడు. దాంతో అతని దూకుడు స్వభావం చూసి భయపడిన లిల్లీ అతనికి పూర్తిగా దూరం అవుతుంది.అలాగే నేషనల్ క్రికెటర్ గా ఎడగలనుకున్న ఆమె… క్రికెట్ ని కూడా వదిలేస్తుంది. మరి తిరిగి ఈ ఇద్దరు ఎలా కలుసుకున్నారు. లిల్లీ క్రికెటర్ గా తన కెరీర్ వదులుకోవడానికి కారణం ఏమిటి? ఆ కారణాలు తెలుసుకున్న కామ్రేడ్ ఆమెను గెలిపించటానికి ఎలాంటి పోరాటం చేసాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:

తన నేచురల్ యాటిట్యూడ్ తోనే సినిమాలను బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లే సత్తా ఉన్న విజయ్ దేవరకొండ కు తగిన క్యారెక్టర్ దొరికింది.అయితే కధలో ఉన్న కన్ఫ్యూజన్ అండ్ ల్యాగ్స్ వల్ల ఆ పాత్ర చాలా డయిల్యూట్ అయింది.అయినప్పటికీ తన ఈజ్ తో టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో ఆ పాత్రకు చాలా వరకు న్యాయం చేశాడు.కాకపోతే తన ఎనర్జీ లెవల్స్ పూర్తిగా చూపించుకొనే సీన్స్ పడకపోవడంతో చాలా వరకు సటిల్డ్ గా నటించాల్సి వచ్చింది. సినిమాలో చైతన్య పాత్ర కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టాడు.ఈ సినిమాలో కధ పరంగా అనేక గెటప్స్ లో కనిపించాడు. ఇక గీత గోవిందం లో క్యూట్ లుక్స్ తో, చాలాకి నటన తో ఆకట్టుకున్న రష్మీక మందన్న ఈ సినిమాలో ఎక్కువ శాతం మేకప్ లేకుండా నేచురల్ గా కనిపించింది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న లిల్లీ పాత్రలో మెరిసింది. ముఖ్యంగా క్లయిమాక్స్ లో ఆమె నటన ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కలసి పండించిన కెమిస్ట్రీ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.తులసి, సంజయ్, ఆశ్రీత తదితరులంతా పాత్రల పరిధి మేర నటించారు. సుహాస్ తదితరులు హీరో ఫ్రెండ్స్ గా మంచి సపోర్ట్ నిచ్చారు.

టెక్నీషియన్స్ :

మొదటి సినిమా కే “మీటు” లాంటి సెన్సిటీవ్ అండ్ బర్నింగ్ ఇష్యు ని మెసేజ్ ఓరియంటెడ్ గా డీల్ చేయాలని చూసిన భారత్ కమ్మ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. కాకపోతే అసలైన కొర్ పాయింట్ ని పక్కన పెట్టి సంభంధం లేని విధంగా లవ్ స్టోరీని నడిపాడు. ఆ డివియోషన్ కి స్లో నెరేషన్ తొడవడం తో కామ్రేడ్ ముందుకు కదలడం కష్టమైపోయింది.స్టార్టింగ్ నుండి ప్రి క్లయిమాక్స్ వరకు డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడు అనేది ఒక ఫజిల్ లా మారింది. ఆ లవ్ ట్రాక్ లో తగినంత ఫీల్ లేదు.కాలక్షేపం చేయడానికి కామెడీ కూడా లేకపోవడంతో కామ్రేడ్ ని భరించడం కష్టమే అన్న ఫీలింగ్ వచ్చింది. క్లయిమాక్స్ మాత్రం నిట్ గా డీల్ చేసాడు. ఇక జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ సినిమాకు సపోర్టింగ్ పిల్లర్ గా నిలిచింది. సినిమాలో మూడు మెలోడీస్ తో పాటు ఆర్.ఆర్.కూడా సినిమాకు పోయాటిక్ టచ్చ్ తెచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.సీన్స్ కి తగ్గ మూడ్ క్రియేట్ చేయగాలిగాడు. అతను వాడిన లైటింగ్ ఫ్యాక్టర్ వలన సినిమాకి రియాలిస్టిక్ టచ్ఛ్ వచ్చింది. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉండాల్సింది. సినిమాకి సంబంధలేని బోర్ కొట్టించే సీన్స్ చాలా వున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి

ఫైనల్ గా :

భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన డియర్ కామ్రేడ్ కంటెంట్ పరంగా యావరేజ్ అనే టాక్ ను తెచ్చుకుంది. దాని వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చినా,వాటిని నిలబెట్టుకొని హిట్ అనిపించుకునే అవకాశాలు పెద్దగా లేవు.