Vijay Deverakonda, Rashmika Dear Comrade Telugu Trailer Talk
Vijay Deverakonda, Rashmika Dear Comrade Telugu Trailer Talk

 

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్.టాక్సీవాలా లాంటి హిట్ మూవీ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అందుకు తగ్గట్టే ఈ సినిమాని తెలుగుతో పాటు మిగతా సౌత్ లాంగ్వేజెస్ అన్నిటిలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇందులో యూనివర్సల్ పాయింట్ ని కథగా ఎంచుకున్నారు అని అర్ధమవుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఈ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి తరహాలోనే ఆవేశపరుడయిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.ఇక అతన్ని ప్రేమించే అమ్మాయిగా,స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ గా కనిపిస్తుంది రష్మిక మందన్న.కాలేజ్ లో జరిగే గొడవల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే బాబీ కి,లిల్లీ ప్రేమలో పడడం…కానీ బాబీ అగ్రెసివ్ నేచుర్ వల్ల లిల్లీ బాబీని వద్దనుకోవడం…ఆ హార్ట్ బ్రేక్ ని భరించలేక అనేక చోట్ల తిరిగిన బాబీ మూడేళ్ళ తరువాత మళ్ళీ లిల్లీ దగ్గరికి వెళ్లడం అనేది సినిమా కథ.ఆ తరువాత ఏం జరిగింది అన్నది సినిమా చూస్తే గానీ క్లారిటీ రాదు.కథ అవుట్ లైన్ అచ్ఛం అర్జున్ రెడ్డే.కానీ లోపల సెట్ అప్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఇది అంతగా బోల్డ్ కంటెంట్ కాదు.క్యారెక్టర్ లో పెయిన్ ని చూపించిన విధానం కూడా వేరేగా ఉంది.ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ మాత్రం రష్మిక-విజయ్ దేవరకొండ ల పెయిరింగ్.రష్మిక ఎప్పటిలానే క్యూట్ గా ఉంది.అలాగే ఈ సినిమాకోసం క్రికెట్ కోచింగ్ తీసుకుని ప్రొఫెషనల్ గా నటించింది కూడా.విజయ్ మాత్రం రెండు,మూడు వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు.ఈ సినిమాకోసం కొత్తరకం యాటిట్యూడ్ తో కనిపించాడు.అలాగే మైత్రి మూవీస్ బ్రాండ్ వేల్యూ ఎలివేట్ అయ్యేలా చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ సినిమా మూడ్ కి తగ్గట్టుగా సాగింది.ఓవర్ ఆల్ గా చూస్తే డియర్ కామ్రేడ్ పై ఒక మోస్తరు అంచనాలు క్రియేట్ చెయ్యగలిగింది ట్రైలర్.కాకపోతే ట్రైలర్ లో విజయ్ చెప్పిన లాస్ట్ డైలాగ్ మాత్రం ఎవరికో కావాలని పంచ్ వేసినట్టుగా ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]