vijay deverakonda world famous lover Catherine Tresa First Look Poster
vijay deverakonda world famous lover Catherine Tresa First Look Poster

విజయ్ దేవరకొండ, ఐశ్వర్యా రాజేష్‌, రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఇజాబెల్లె లెయితె హీరోహీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్‌`. వేలంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రమోషన్స్‌ను యూనిక్‌గా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే విజయ్ దేవరకొండ భార్య పాత్రలో నటిస్తోన్న ఐశ్వర్యా రాజేష్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా విడుదల చేసిన విజరుదేవరకొండతో ఉన్న ఇజాబెల్లె లెయితె లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఫ్రెంచ్‌ లవర్‌ ఇజాతో విజరు ఉన్నారు. మరి ఫ్రాన్స్‌కు, విజరు దేవరకొండకు ఉన్న కనెక్షన్‌ ఏంటనేది ఆసక్తికరం.ఇందులో విజరు దేవరకొండను గౌతమ్‌ అని ఇజాబెల్లె సంబోధిస్తుంది. ఇంతకు ముందు విడుదల చేసిన లుక్‌లో డీసెంట్‌ క్లీన్‌ షేవ్‌లో శీనయ్యగా కనపడ్డ విజరు దేవరకొండ ఈ లుక్‌లో అర్బన్‌ లుక్‌లో గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ రెండు లుక్స్‌లో విజయ్ దేవరకొండ డిఫరెంట్‌గా కనపడుతున్నారు.

శనివారం క్యాథరిన్‌ థ్రెసా లుక్‌ను విడుదల చేశారు. ఇందులో క్యాథరిన్‌కు సింగరేణి ప్రాంతానికి లింక్‌ ఉంది. ఆమె విజయ్‌ను శ్రీనుగా సంబోధిస్తుంది. పాత్ర పరంగా సింగరేణి ప్రాంతంతో తనకున్న రిలేషన్‌ గురించి “బొగ్గు గనిలో నా బంగారం, నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఈ వేలంటెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శ్రీనును కలుసుకుందాం” అంటూ క్యాథరిన్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని సింగరేణి కార్మికుడిగా విజయ్‌ దేవరకొండ కనపడుతున్నారు.

ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ స్మిత పాత్రలో క్యాథరిన్‌ కనపడుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన విజయ్‌ దేవరకొండ రెండు లుక్స్‌కు ఈ లుక్‌ డిఫరెంట్‌గా ఉంది. జనవరి 3న ఈ సినిమా టీజర్‌ విడుదలవుతుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.