`వరల్డ్ ఫేమస్ లవర్‌`: ఇక్కడ శీనయ్య.. అక్కడ గౌతమ్

vijay deverakonda world famous lover Izabelle Leite First look Poster
vijay deverakonda world famous lover Izabelle Leite First look Poster

విజయ్ దేవరకొండ, ఐశ్వర్యా రాజేష్‌, రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఇజాబెల్లె లెయితె హీరోహీరోయిన్లుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్‌`. వేలంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రమోషన్స్‌ను యూనిక్‌గా ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే విజయ్ దేవరకొండ భార్య పాత్రలో నటిస్తోన్న ఐశ్వర్యా రాజేష్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా విడుదల చేసిన విజరుదేవరకొండతో ఉన్న ఇజాబెల్లె లెయితె లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఫ్రెంచ్‌ లవర్‌ ఇజాతో విజరు ఉన్నారు. మరి ఫ్రాన్స్‌కు, విజరు దేవరకొండకు ఉన్న కనెక్షన్‌ ఏంటనేది ఆసక్తికరం.ఇందులో విజరు దేవరకొండను గౌతమ్‌ అని ఇజాబెల్లె సంబోధిస్తుంది. ఇంతకు ముందు విడుదల చేసిన లుక్‌లో డీసెంట్‌ క్లీన్‌ షేవ్‌లో శీనయ్యగా కనపడ్డ విజరు దేవరకొండ ఈ లుక్‌లో అర్బన్‌ లుక్‌లో గడ్డంతో కనిపిస్తున్నారు.

ఈ రెండు లుక్స్‌లో విజయ్ దేవరకొండ డిఫరెంట్‌గా కనపడుతున్నారు. అలాగే ఈ సినిమాలో నటిస్తోన్న మరో ఇద్దరు హీరోయిన్స్ క్యాథరిన్ త్రెసా, రాశీఖన్నాలకు సంబంధించిన లుక్స్ విడుదల కావాల్సి ఉన్నాయి. జనవరి 3న సినిమా టీజర్ విడుదల కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో..సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్‌.రామారావు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు.