సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ ‘మాస్టర్’ సినిమా

182
సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ 'మాస్టర్' సినిమా
సెన్సార్ పూర్తి చేసుకున్న విజయ్ 'మాస్టర్' సినిమా

స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

 

అదేవిధంగా ఆండ్రియా జెరోమియా- శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలు కనిపించనున్నారు. సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వార్ కి మాస్టర్ సినిమా తెరలేపనుందన్న ప్రచారం మొదలైంది. తాజాగా మాస్టర్ మూవీ సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. సెన్సార్  బోర్డ్ ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ ఇచ్చిందని  నిర్మాతలు స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించే అవకాశం ఉంది. తాజాగా యుఏ మార్క్ తో `మాస్టర్` పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్మాణ సంస్థ XB ఫిల్మ్ క్రియేటర్స్ త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు.