తమిళనాడు లో అన్ని థియేటర్లలోనూ ‘మాస్టర్’ సినిమా

143
తమిళనాడు లో అన్ని థియేటర్లలోనూ 'మాస్టర్' సినిమా
తమిళనాడు లో అన్ని థియేటర్లలోనూ 'మాస్టర్' సినిమా

పొంగల్ కానుకగా తమిళనాడులో ఇటు విజయ్ ‘మాస్టర్’, అటు శింబు ‘ఈశ్వరన్’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ భారీ చిత్రాల విడుదల నేపథ్యంలో థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచుతూ జనవరి 4న తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ రెండు రోజులు గడవకముందే జనవరి 6న కరోనా ఇంకా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో యాభై శాతం ఆక్యుపెన్సీనే కొనసాగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్ కు సలహా ఇచ్చింది. దాంతో పొంగల్ సీజన్ లో విడుదలయ్యే సినిమాల విషయంలో అనిశ్చితి ఏర్పడింది.

 

 

 

ఇటు ప్రభుత్వం, అటు ఆ యా చిత్రాల నిర్మాతలూ తమ వైఖరిని ఇంతవరకూ తెలియచేయలేదు. కానీ తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ హెడ్ తిరుప్పుర్ సుబ్రహ్మణ్యం మాత్రం తామో అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపాడు. ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీ విషయంలో వెనక్కి తగ్గితే… రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ ‘మాస్టర్’ సినిమానే తాము ప్రదర్శిస్తామని, తమ తొలి ప్రాధాన్యం విజయ్ సినిమాకే అని స్పష్టం చేశాడు. అయితే… పొంగల్ కానుకగా ‘మాస్టర్’ 13న విడుదల కాబోతుండగా, ఆ మర్నాడే అంటే 14వ తేదీ శింబు ‘ఈశ్వరన్‌’ విడుదల కావాల్సి ఉంది. మరి ఈ సినిమా పరిస్థితి ఏమౌతుందో చూడాలి!