నటీనటులు : విజయ్, విజయ్ సేతుపతి, మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా (Vijay Master Review Rating)
Chitrambhalare.in Rating : 2.75/5
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
నిర్మాతలు : గ్జావియర్ బ్రిట్టో
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పేరుకు కోలీవుడ్ హీరో అయినా..తన ప్రతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్లోమంచి మార్కెటింగ్ సంపాదించుకున్నాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మాస్టర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.
కథ:
భవాని(విజయ్ సేతుపతి) వరంగల్లో ఓ పేరు మోసిన రౌడీ. తాను ఎలా ఉంటాడో జనాలకు ఎక్కువ తెలియదు కానీ.. తన భయమేంటో జిల్లా మొత్తానికి తెలుసు. లారీలలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ, రాజకీయంగా ఎదగాలని చూస్తాడు. వాటిల్లో జేడీ సపోర్ట్ తో జేడీ మనిషి గెలవడం, మరోపక్క భవానీ(విజయ్ సేతుపతి) జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితులు కారణంగా అతను రాక్షసుడుగా మారతాడు. ఇదిలా ఉంటే జేడీ(విజయ్) ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్. మద్యానికి బానిసై తోటి సిబ్బందికి తలనొప్పిగా మారుతాడు. అతనంటే తోటి సిబ్బందికి ఇష్టం లేకపోయినా… విద్యార్థులకు మాత్రం ఆయనే హీరో. జేడీ సర్ లేనిదే కాలేజీలో ఎలాంటి కార్యక్రమాలు జరనివ్వరు. ఈ క్రమంలో కొన్ని ఊహించని సంఘటనల మధ్య భవానీకి అడ్డుగా జేడీ నిలుస్తాడు ? భవానీ నుండి పిల్లలను సేవ్ చేయడానికి జేడీ ఎలాంటి ప్రయత్నం చేస్తాడు. దాంతో జరిగే కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి ? ఈ మధ్యలో అలాగే చివరకు ఏమి జరిగింది అనేదే మిగిలిన కథ.
నటీనటులు
ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్గా విజయ్ ఒదిగి పోయాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే తన కామెడీ టైమింగ్ తోనూ విజయ్ అక్కడక్కడ నవ్విస్తారు. మరో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో పాటు తన కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్నారు. మాళవికా మోహన్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్ తమ పరిధి మేర నటించారు.
ప్లస్ పాయింట్స్ :
విజయ్,
విజయ్ సేతుపతి నటన
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్లు
సెకెండ్ హాఫ్
బాడ్ స్క్రీన్ ప్లే
తీర్పు :
ఈ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ గా విజయ్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే విలన్ గా విజయ్ సేతుపతి మరోసారి మెప్పించాడు. అయితే సినిమా నెరేషన్ చాలా స్లోగా ఉందని, స్క్రీన్ప్లే అస్సలు బాగాలేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే, అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయిందని ప్రశంసిస్తు్న్నారు. సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం, ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను రూపొందించలేకపోవడం, సెకండాఫ్ సినిమాకు పెద్ద మైనస్ అని టాక్.