Vijay Master Teaser: ఇలయదళపతి విజయ్‌కి రికార్డులు కొత్తేమి కాదు. ఆయన ప్రతి సినిమా ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది.ఇపుడు మల్లి విజయ్ మరోసారి తన సత్తా చాటాడు. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న మాస్టర్ చిత్రం రికార్డుల పరంపర కొనసాగిస్తూ ఉంది. ఆ మద్య చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి అంతటా మంచి ప్రేక్షకాదరణ లభించింది. రోజు రోజుకు టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. వ్యూస్ మరియు లైక్స్ విషయంలో తమిళ ఆడియన్స్ ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేశారు.
లేటెస్ట్గా మాస్టర్ టీజర్ 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డ్ సెట్ చేసింది. అంతే కాకుండా 2.4 మిలియన్ లైక్స్ తో మన దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ గా కూడా సెన్సేషనల్ రికార్దును అందుకుంది. మాస్టర్ సినిమాపై విజయ్ అభిమానుల్లో అంచనాలకు ఇది ఒక నిదర్శణంగా చెప్పుకోవచ్చు. మాస్టర్ హవా చూస్తుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని తెలుస్తుంది.
మాస్టర్ చిత్రానికి సంగీతం అనిరుద్ అందివ్వగా విలన్ రోల్ లో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. కొత్త దర్శకుడితో విజయ్ చేసిన సినిమాకు ఎందుకు ఇంత హైప్ అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన ఆగింది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అంటూ తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.