“మాస్టర్” పైరసీ దొంగ దొరికాడు

498
vijay-s-master-piracy-culprit-founded-sdc-empolyee
vijay-s-master-piracy-culprit-founded-sdc-empolyee

ఇళయ థలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు రెడీ అవుతున్న సందర్భంలో సరిగ్గా రెండు రోజుల ముందు ఆ సినిమా అంతా లీకైపోవడం షాక్ చిత్ర యూనిట్ కి మరియు మిగతా సినీ వర్గాలలో సంచలనం రేపింది.

పలు సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇది వందల మంది కష్టానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. అయితే అసలు ఈ చిత్రం లీక్ చేసింది ఎవరో దొరికినట్టు ఇప్పుడు తెలుస్తుంది. తమిళ నాట “ఎస్ డి సి సినిమాస్” కు చెందిన ఓ ఎంప్లాయ్ ఈ పనిని చేసాడట.

 

 

థియేటర్ కు వచ్చిన ప్రింట్ ను అతను పైరసి చేసినట్టుగా మాస్టర్ యూనిట్ ఆధారాలు కనుక్కొన్నారని అతనిపై మరియు వారి కంపెనీపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించగా రేపు జనవరి 13న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది.