బేబమ్మతో సినిమా చేయనంటున్న విజయ్ సేతుపతి

0
34
Vijay sethupathi Comments on hot beauty Krithi Shetty

Krithi Shetty: Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొన్నటి వరకు తమిళ ప్రేక్షకులని మాత్రమే అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

కాగా, తాజాగా ‘లాభం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాను కథానాయకుడిగా చేయనున్న ఓ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని అన్నారు. అయితే విజయ్ సేతుపతి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని ఆమెని రిజెక్ట్ చేశానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి.

ఉప్పెన’ క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడింది. దాంతో నేను.. ‘బేబమ్మ.. నాకు నీ వయసు కొడుకే ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. భయపడకు. ఎలాంటి కంగారు లేకుండా ధైర్యంగా చెయ్‌’ అని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు’’ అని విజయ్‌ సేతుపతి వివరించారు.

Vijay sethupathi Comments on hot beauty Krithi Shetty

ఇక, ‘లాభం’ సినిమా విషయానికి వస్తే.. వ్యవసాయం, దళారీ వ్యవస్థ, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేసే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్‌ రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఎస్‌.పి.జననాథన్‌ దర్శకుడు. ఇమాన్‌ సంగీతం అందించారు. సెప్టెంబర్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

 

Previous articleఈ వారం థియేటర్‌ లో రిలీజ్ మూవీస్ లిస్ట్ ..!
Next articleDirector Shankar’s daughter Aditi’s debut film with Surya