డిఫరెంట్ కాన్సెప్ట్‌ థ్రిల్లర్ మూవీ ‘A’: విజయ్ సేతుపతి

213
Vijay Sethupathi Comments On Thriller Movie A

వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరవుతున్నారు విజయ్ సేతుపతి. ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ విలక్షణ రోల్స్ పోషిస్తున్న ఆయన ఇటీవలే ‘ఉప్పెన’ విజయంలో కీలకం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ‘A’ అనే తెలుగు మూవీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఆ కథ ఎంతో బాగుందని చెబుతూ సినిమాపై హైప్ పెంచేశారు విజయ్ సేతుపతి.

విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. ఇటీవలే ముంబై లో ఉన్న విజయ్ సేతుపతి ని చిత్ర బృందం కలిసి తమ సినిమా కు సపోర్ట్ గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని కొంత పార్ట్ ని చూసి అయన ఎంతో థ్రిల్ కి గురయ్యారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు. విజయ్ సేతుపతి సపోర్ట్ ఉండడంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువయ్యింది. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ని PVR పిక్చర్స్ వారు ఘనంగా విడుదల చేయబోతున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్నిఅందించారు.

Also Read: అల్లు అర్జున్‌తో నటించాలని ఉందంటూ ఓపెన్ ప్రియా ప్రకాష్

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో ‘A’ మూవీ రూపొందింది. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం డిఫరెంట్ థ్రిల్లర్‌గా అలరించనుందట. విజయ్ కురాకుల సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయగా ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ముంబైలో షూటింగ్స్‌లో పాల్గొంటున్న విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకనిర్మాతలు.