Vijay Sethupathi Director Vijay Chander Excellent Words About Pawan Kalyan
Vijay Sethupathi Director Vijay Chander Excellent Words About Pawan Kalyan

కొంత మంది దర్శకులు ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో అదే కథను వేరొక హీరోతో చేయాల్సి వస్తుంది. గత కొన్నేళ్ళుగా ఏ సినిమా ఫంక్షన్లో అయినా సరే జనాలు కాస్త నీరసంగా ఉంటే.. పవన్ కళ్యాణ్ పేరు చెప్పేవారు కొంతమంది సినీ ప్రముఖులు. సందర్భం ఉన్నా.. లేకపోయినా ఆ పేరు చెప్తే జనాలు కూడా గట్టిగా అరవడం మొదలు పెట్టేవారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళ లిస్ట్ చాలానే ఉంది.

‘విజయ్ సేతుపతి’ దర్శకుడు విజయ్ చందర్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘సంగతమిళన్’. రాశీఖన్నా హీరోయిన్. నివేద పేతురాజ్ మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈనెల 15న రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ వేడుకలో.. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ చందర్‌తో ‘సమయం’ కాసేపు ముచ్చటించింది. సినిమా గురించి అడిగి తెలుసుకుంది. ఈ సంభాషణలో విజయ్ చందర్ ఆశ్చర్యకర విషయాలు చెప్పుకొచ్చారు. అసలు ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని చెప్పారు. కానీ, ఆయన రాజకీయాలతో బిజీ అయిపోవడంతో విజయ్ సేతుపతితో చేశానని అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారికి ‘డై హార్డ్ ఫ్యాన్’. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో… విజయ్ సేతుపతితో చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

తెలుగులో పవన్ కళ్యాణ్ మాదిరిగానే తమిళంలో విజయ్ సేతుపతికి మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అందుకే కథను ఆయన వద్దకు తీసుకెళ్లానని అన్నారు. కథ నచ్చడంతో విజయ్ సేతుపతి వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. టీజర్ చూసి ఇది పక్కా కమర్షియల్ మూవీ అనుకుంటున్నారని, కానీ దీనిలో సోషల్ మెసేజ్ కూడా ఉందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలతో సినిమాలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం కథ సిద్ధం చేస్తానని వెల్లడించారు.