Vijay Sethupathi joins shooting of Vijay 64
Vijay Sethupathi joins shooting of Vijay 64

తమిళ స్టార్ హీరో విజయ్ తన 64వ సినిమాను లోకేష్ కనగరాజ్ అనే యువ దర్శకుడితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ విజయ్‌ సేతుపతి, విలన్‌ క్యారెక్టర్‌ ను పోషిస్తున్నారు. ఈ మేరకు షూటింగ్‌ లో జాయిన్‌ అయినట్లు చిత్రబృందం నిన్న అధికారికంగా పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది. అయితే తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉంటుందని, హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. దీంతో విజయ్ అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ్ ఇండస్ట్రీలో బాగా వైరల్‌ అవుతోంది. ఎక్స్.బి ఫిల్మ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 2020 వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇది వ‌ర‌కు అట్లీ – విజయ్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా బిగిల్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను ఏక కాలంలో విడుద‌ల చేస్తున్నారు. ఇక విజయ్‌ సేతుపతి కూడా సైరా సినిమాతో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.