ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎన్టీఆర్, మాటల మాంత్రికుడి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె’ అనే టైటల్ పరిశీలిస్తోంది చిత్ర బృందం. మరోవైపు ఈ చిత్రానికి ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును కూడా అనుకుంటున్నారు. .
ఈ సినిమా రాజమౌళి సినిమా తర్వాత ఉండనుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అగ్రదర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నాడు. కాగా ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్గా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ తమిళ హీరో మక్కల్ సెల్వన్ విలన్ పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
‘మాస్టర్’, ‘ఉప్పెన’ సినిమాల్లో తనదైన విలనిజంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించాడు విజయ్ సేతుపతి. అందుకే ఇపుడు ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఇతనైతే కరెక్ట్‌గా ఉంటుందని త్రివిక్రమ్ భావించి విజయ్ సేతుపతిని కలిసి ఈ సినిమా స్టోరీ వినిపించాడట. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో తన పాత్ర నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విజయ్ సేతుపతి కంటే ఈ సినిమాలో విలన్‌గా శింబును అనుకున్నారు. ఫైనల్‌గా విజయ్ సేతుపతిని ఫైనలైజ్ చేసినట్టు సమాచారం.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్గా ఈ చిత్రంలో బాలీవుడ్ నటీ వరీనా హుసేన్ హీరోయిన్’గా ఖారారు అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో వస్తోన్న ఈ సినిమా స్కిప్ట్ వర్క్ దాదాపు పూర్తి అయ్యింది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమాలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఏమంత గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడని సమాచారం
పాన్ ఇండియా లెవెల్లో అందరికి అప్పిల్ అయ్యేవిధంగా ఈ సినిమా కథను తయారు చేస్తున్నాడు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్.ఈ సినిమాలో విలన్స్‌గా సంజయ్ దత్ ఉత్తరాది రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తే.. విజయ్ సేతుపతి దక్షిణాది పొలిటికల్ లీడర్ పాత్రలో అలరించనున్నట్టు సమాచారం.