Vijay Whistle (Bigil) 5 days Box office Collections report
Vijay Whistle (Bigil) 5 days Box office Collections report

ఇలయ దళపతి విజయ్ (Vijay) నటించిన విజిల్ (Whistle) ఓ వైపు, కార్తీ నటించిన ఖైదీ మరో వైపు. విజిల్ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ మాస్‌కు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉండటం కలసొచ్చే అంశం.. విజయ్ (Vijay) సినిమా తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు నుండే సాలిడ్ వసూళ్ళ ని అందుకోగా ఇప్పుడు విజయ్ కెరీర్ లో తెలుగు లో నంబర్ 1 మూవీ గా నిలవడానికి సిద్దం అవుతుంది, 5వ రోజు మిగిలిన 4 రోజుల మీద బాగా డ్రాప్ అయినప్పటికీ డబ్బింగ్ సినిమాకి ఇవి డీసెంట్ నెంబర్స్ అనే చెప్పాలి. మొదటి ఐదు రోజుల్లోనే దాదాపు 80% రికవరీ చేసింది.

దర్శకుడు అట్లీ ఇంతకుమందు తేరీ, మెర్సెల్ సినిమాలతో విజయ్ కెరీర్‌లోనే నిలిచిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించగా.. మూడో సినిమా విజిల్‌తో హ్యాట్రిక్ కోటింది..ఇక 5 వ రోజు వర్కింగ్ డే అవ్వడం తో సినిమా కలెక్షన్స్ కొద్దివరకు స్లో డౌన్ అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 66 లక్షల దాకా షేర్ ని అందుకుంది..

ఏరియాల వారీగా ‘విజిల్’ ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు..

నైజాం – 2.66 కోట్లు
సీడెడ్ – 2.36 కోట్లు
గుంటూరు – 85.2 లక్షలు
ఉత్తరాంధ్ర – 83.3 లక్షలు
తూర్పు గోదావరి – 56.1 లక్షలు
పశ్చిమ గోదావరి – 38.7లక్షలు
కృష్ణా – 54.3 లక్షలు
నెల్లూరు – 35.8 లక్షలు

మొత్తం షేర్ – 8.55 కోట్లు