రాజమౌళి – Mahesh Babu మూవీ పై క్లూ ఇచ్చిన రచయిత

Mahesh Babu – Rajamouli: మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ఏ జానర్ అనేది రచయత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) వెల్లడించారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా పనుల్లో ఉన్న రాజమౌళి ఆ తరువాత ప్రాజెక్టును చేసేది మహేశ్ బాబుతోనే. ఇప్పటికే ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) తెలుగుతో పాటు హిందీలో తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ కూడా మొదలు పెట్టారు.

అయితే ప్రభాస్ .. చరణ్ .. ఎన్టీఆర్ ల కోసం రాజమౌళి కథలను సిద్ధం చేయడం వేరు.. మహేశ్ బాబుతో చేయడం వేరు. ఎందుకంటే పౌరాణికాలు .. చారిత్రకాలు తనవంటికి సరిపడవని చాలా సందర్భాల్లో మహేశ్ బాబు చెప్పాడు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు.

Mahesh Babu SS Rajamouli story based on Hollywood movie

అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్‌ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా (Pan India) లెవల్లో తెరకెక్కుతున్నాయి.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles