డీటెయిల్స్: విజయేంద్రప్రసాద్ కథతో పవన్ కళ్యాణ్ మూవీ..?

0
59
Vijayendra prasad script for Pawan Kalyan Next movie

Pawan Kalyan: రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజియేంద్ర ప్రసాద్ ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కు రంగం సిద్దమైంది. వరసగా బాలీవుడ్,కోలీవుడ్ ప్రాజెక్టులకు కథలు అందిస్తున్న విజయేంద్రప్రసాద్ తాజాగా పవన్ కళ్యాణ్ ని కలిసి ఓ కథ వినిపించారని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు అత్యంత అభిమానమని స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసాడు. పవన్ కళ్యాణ్ ని మించిన పవర్ ఫుల్ యాక్టర్ మరొకరు లేరని అన్నారు. పవన్ పర్శనల్ క్యారక్టర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ని కలసి చెప్పటం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాసారు. కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు.

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పవన్ ఇప్పటికే 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆ మూడు పూర్తవ్వడానికి ఏడాదిన్నర సమయం పడుతుంది. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది కూడా పెద్ద ప్రశ్న.

అయితే ఆ బాధ్యత పవన్ తీసుకున్నారని సమాచారం. నిర్మాత, దర్శకుడుని ఆయనే ఎంపిక చేసి చెప్తానని చెప్పినట్లు సమాచారం. అంటే త్వరలోనే ఆ కథ తెరకెక్కుతుందన్నమాట.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నారు పవన్. హరిహర వీరమల్లు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్. మొఘలాయుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అలాగే మాలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు పవన్.