Homeసినిమా వార్తలు8 ఏళ్ల తర్వాత స్టార్ హీరో సినిమాకి మోక్షం..!

8 ఏళ్ల తర్వాత స్టార్ హీరో సినిమాకి మోక్షం..!

Vikram’s Dhruva Natchathiram release date has been locked which is directed by Gautham Menon. Dhruva Natchathiram Release Date, Dhruva Natchathiram Shooting update, Dhruva Natchathiram Movie latest news

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్, (Vikram) సెన్సిబుల్ డైరక్టర్ గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం (Dhruva Natchathiram) ”ధృవ నక్షత్రం”. 2015 లోనే సెట్స్ మీదకి వెళ్ళిన ఈ సినిమా, వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి మోక్షం లభించబోతోంది. 8 ఏళ్ళ తర్వాత ఈ మూవీ రిలీజ్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అప్పుడెప్పుడో ఆగిపోయిన ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram) సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ షూటింగ్ మిగిలి ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేకపోవడంతో.. హీరో విక్రమ్ సహా నటీనటులు, టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్టుపై ఆశలు వదులుకుని వేరే సినిమాలు చేసుకుంటున్నారు. ఐతే దర్శకుడు గౌతమ్ మీనన్ ఇటీవలే విక్రమ్ తో పాటుగా ఇతర ఆర్టిస్టులను రప్పించి పెండింగ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేశారు.

‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram) మూవీలో కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు బెనెడిక్ట్ గారెట్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. విక్రమ్ నటించిన మహాన్, పొన్నియన్ సెల్వన్-1 సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు వీలైంత త్వరగా మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, ‘ధృవ నక్షత్రం’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఏప్రిల్ 28న ‘PS 2’ సినిమా విడుదల అవుతోంది కాబట్టి.. దాని తర్వాత ‘ధృవ నక్షత్రం’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే మంచి ఫలితాన్ని అందుకోవచ్చని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా మే 19వ తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ప్రమోషనల్ కంటెంట్ ను వదిలే అవకాశం వుందని అంటున్నారు.

ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో చియాన్ సరసన ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతూ వర్మ – ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సిమ్రన్‌, రాధిక, దివ్య దర్శిణి, పార్థీబన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హరీష్ జైరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు, ‘ఒరు మనం’ అనే ఫస్ట్ సింగిల్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ‘ధృవ నక్షత్రం’ రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Vikram’s Dhruva Natchathiram release date has been locked which is directed by Gautham Menon. Dhruva Natchathiram Release Date, Dhruva Natchathiram Shooting update, Dhruva Natchathiram Movie latest news

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY