Vinaro Bhagyamu Vishnu Katha Review in Telugu: యంగ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ తో మేకర్స్ సినిమాపై యూత్ బజ్జీని ఏర్పడేటట్టు చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే అది ఎలాగో చూద్దాం.
Vinaro Bhagyamu Vishnu Katha Rating: 2.5/3
నటినటులు:కిరణ్ అబ్బవరం, కశ్మీరీ పరదేశి, మురళీ శర్మ , శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకత్వం:మురళీ కిశోర్ అబ్బూరు
నిర్మాత:బన్నీ వాసు
సంగీతం:చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ:డానియల్ విశ్వాస్
Vinaro Bhagyamu Vishnu Katha Review in Telugu: కథ: విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతికి చెందిన కుర్రాడు. చిన్నపుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతను తాత సంరక్షణలో పెరుగుతూ.. హైదరాబాద్ లో లైబ్రేరియన్ గా సెటిలవుతాడు. అతనికి దర్శన (కాశ్మీరా పరదేశి)తో అనుకోకుండా ఫోన్ ద్వారా పరిచయం అవుతుంది. యూట్యూబర్ అయిన కాశ్మీరా.. నెయిబర్ నంబర్ (మన ఫోన్ నంబర్ కు అటు ఇటు ఇటు ఉండే ఫోన్ నంబర్లు) కాన్సెప్ట్ మీద వీడియోలు చేసి ఫేమస్ అవ్వాలనుకుంటుంది.
అలా విష్ణుతో పాటు శర్మ (మురళీ శర్మ)కు ఫోన్ చేసి పరిచయం చేసుకుంటుంది. ఇలా ఈ ఇద్దరినీ కలిసి వీడియోలు చేసే క్రమంలో దర్శన.. శర్మ హత్య కేసులో చిక్కుకుంటుంది. ఇంతకీ శర్మ ఎవరు.. తన నేపథ్యమేంటి.. అతణ్ని చంపిందెవరు.. ఈ కేసు నుంచి దర్శనను విష్ణు ఎలా బయటికి తీసుకొచ్చాడు అన్నది మిగతా కథ.
నటీనటులు: కిరణ్ అబ్బవరం క్యారెక్టరైజేషన్ సినిమాకు బెస్ట్ పార్ట్ అని చెప్పవచ్చు. తన నటన ప్రతిభతో సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత అందించాలనుకునే వ్యక్తిగా కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. శర్మగా మురళీ శర్మ అద్భుతం. ఎప్పటిలాగే, సీనియర్ నటుడు తన బెస్ట్ ఇచ్చి ప్రొసీడింగ్స్‌కి డెప్త్ తెచ్చాడు.
హీరోయిన్ కాశ్మీరా పరదేశి చూడ్డానికి క్యూట్ గా.. బబ్లీగా అనిపిస్తుంది. తెలుగులో కాశ్మీరా పరదేశికి ఇది రెండవ చిత్రం, నటన పరంగా తను ప్రత్యేకంగా చేయడానికి ఏమీ స్కోప్ లేకపోయింది. శుభలేఖ సుధాకర్.. ఆమని.. ప్రవీణ్.. దేవీ ప్రసాద్ అలాగే మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
తీర్పు: ఈ సినిమా ట్రైలర్ అలాగే టీజర్ లో చూపిన విధంగానే ఇది ఒక కాన్సెప్ట్ మూవీ. మన ఫోన్ నెంబర్లలో మొదటి అలాగే చివరి నెంబర్లు మార్చి కాల్ చేయటం వల్ల పరిచయం అయ్యే వ్యక్తులతో కొనసాగే సినిమా కథ ఇది. రచయిత-దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు విషయానికి వస్తే కథ బాగానే రాసుకున్నారు.
కానీ కథలో చెప్పుకోదగ్గ మలుపులు ఉండడం.. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో రేకెత్తించడం వల్ల ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ‘హై’ ఇచ్చే అంశాలు లేకపోయినా.. సినిమా బోర్ అయితే కొట్టించదు.
సినిమా అసలు పాయింట్‌కి రావడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం హీరో హీరోయిన్ అలాగే మురళీ శర్మ మీద కామెడీ ట్రాక్ ని రన్ చేశాడు దర్శకుడు. అయితే హీరో పాత్రకు కనెక్ట్ అయ్యే మొదటి గంటలో మళ్లీ కొన్ని అనవసరమైన సన్నివేశాలు జోడించబడ్డాయి ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే కొంచెం ట్విస్ట్ అనిపించినా కానీ తర్వాత అది తేలిపోతుంది.
సెకండ్ హాఫ్ లో వచ్చే క్రైమ్ ఎలిమెంటే సినిమాను ముందుకు నడిపిస్తుంది. మురళీ శర్మ పాత్రలోని నిగూఢత్వం క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ట్విస్టులు క్యూరియాసిటీని పెంచుతాయి. మురళీ శర్మ పాత్ర తాలూకు గుట్టంతా బయటికి వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్. మంచి క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ.
మొత్తం మీద వినరో భాగ్యము విష్ణు కథలో మంచి వినోదం మరియు సస్పెన్స్ అంశాలు ఉన్నాయి. కిరణ్ అబ్బవరం యొక్క మచ్చలేని నటన, మురళీ శర్మ యొక్క చక్కటి నటన మరియు కొన్ని మంచి ట్విస్టులు ఈ సినిమాని చూసే విధంగా చేస్తాయి. అయితే, రొటీన్ డైలాగులు, బోర్ కొట్టించే చాలా సీన్స్ అలాగే దర్శకుడు స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నట్టయితే సినిమా ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఈ శివరాత్రి పండుగ సీజన్‌లో సినిమా ఒక్కసారి చూడవచ్చు.