Vinaro Bhagyamu Vishnu Katha Trailer: టాలీవుడ్ లో ఉన్న హీరోస్ లో కిరణ్ అబ్బవరం కూడా ఒకళ్ళు. కిరణ్ కూడా భిన్నమైన సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమాని ఫిబ్రవరి 17న గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధం చేశారు మేకర్స్.
Vinaro Bhagyamu Vishnu Katha Trailer: ప్రమోషన్ లో భాగంగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుండి ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తి రేపుతోంది. మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది.
సినిమా ట్రైలర్ కి ఇప్పుడు మంచి రెస్పాన్స్ నమోదు అవుతుంది. మరి లేటెస్ట్ గా ఈ ట్రైలర్ అయితే రియల్ టైం లో 40 లక్షల కి పైగా వ్యూస్ వచ్చినట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ ట్రైలర్ తో అయితే సినిమాపై మరిన్ని అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాణం వహించారు.