రానా ‘విరాటపర్వం’ టీజర్ వచ్చేసింది

400
Viraata Parvam Teaser | Rana Daggubati | Sai Pallavi, Venu Udugula
Viraata Parvam Teaser | Rana Daggubati | Sai Pallavi, Venu Udugula

యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’.  వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

 

యదార్ధ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసారు.

 

ఈ చిత్రంలో సాయి పల్లవి 1990’s నాటి పల్లెటూరి ఆడపిల్లగా లుక్ ఆకట్టుకుంది. మరో టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. దర్శకుడు వేణు ఉడుగుల చిత్ర విజయంపై చాలా విశ్వాసంతో ఉన్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.