Did Chiranjeevi really shave .. should be shocked if you knew the real truth ..
Did Chiranjeevi really shave .. should be shocked if you knew the real truth ..

Megastar Chiranjeevi Urban Monk look: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా అర్భన్ మాంక్ అదేనండి బోడి గుండుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ వెనక ఉన్న అసలు రహస్యాన్ని చిరంజీవి బయటపెట్టారు. టెక్నీషియన్స్ అంతా కలిసి గుండును రెడీ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి సర్‌ప్రైజ్ చేశారు.

మెగాస్టార్‌గా కోట్లాది అభిమానుల గుండెల్లో అలా స్థిరపడిపోయిన ఆయన 65 ఏళ్ల వయసులోనూ మ్యాజిక్ చేస్తూ సినిమాపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. క్యారెక్టర్‌లో ఒదిగిపోయేందుకు చిరంజీవి ఎంత రిస్క్ తీసుకుంటారనేది గతంలోనే ఎన్నో సినిమాలతో ప్రూవ్ అయింది.

చిరంజీవి రీసెంట్‌గా అర్భన్ మాంక్ అదేనండి బోడి గుండుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అయితే.. చిరంజీవి ఈ గుండు చేయించుకున్నాడా అని అభిమానులు రకరకాలుగా చర్చించుకున్నారు. ఆయన ఫోటో పోస్ట్ చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకు దుమ్ము దులిపేస్తుంది అది.

అయితే అది రియల్ గుండు కాదని, తమ టెక్నీషియన్స్ ఇలా తయారు చేశారని తెలుపుతూ ఆ వీడియోను అందరి ముందుంచారు మెగాస్టార్. ఈ మేరకు తన లుక్‌ వెనకున్న సీక్రెట్‌ను స్వయంగా రివీల్‌ చేశారు. ”నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్” అంటూ పోస్ట్ పెట్టారు చిరంజీవి.